ఆక‌ట్టుకునే లుక్‌లో కార్తి.. 30న విడుద‌ల కానున్న టీజ‌ర్

Sat,May 25, 2019 08:35 AM

సూర్య సోద‌రుడు కార్తి మంచి సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదం అందిస్తున్నాడు. ఆయ‌న తాజాగా ఖైదీ అనే సినిమా చేస్తున్నాడు. మా న‌గ‌రం ఫేమ్ లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం యాక్ష‌న్ నేప‌థ్యంలో ఉంటుంద‌ట‌. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి ఫ‌స్ట్ లుక్ విడుదలైంది. అందులో కార్తీ మొఖంపైన ర‌క్త‌పు ధార‌లు కారుతున్నాయి. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. తాజాగా కార్తీకి సంబంధించి మ‌రో పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో కార్తీ ర‌క్తంతో వీరావేశంగా క‌నిపిస్తున్నాడు. ఈ పోస్ట‌ర్ ద్వారా టీజ‌ర్‌ని మే 30న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు మేకర్స్ . మ‌రోవైపు రెమో ఫేమ్‌ భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు కార్తీ. రష్మికా మండన్నా కథానాయికగా నటించనుంది. ఇదే కాక పాప‌నాశం తెర‌కెక్కించిన జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలోను ఓ సినిమా చేస్తున్నాడు కార్తీ. జ్యోతిక‌, స‌త్య‌రాజ్ ప్రధాన పాత్ర‌ల‌లో న‌టించ‌నున్న ఈ సినిమాలో ఆన్స‌న్ పాల్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. గోవింద్ వ‌సంత్ చిత్రానికి సంగీతం అందించ‌నుండ‌గా, రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

1692
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles