మామ‌, కోడ‌లి మ‌ధ్య స‌ర‌దా సంభాష‌ణ

Sat,August 18, 2018 09:46 AM
interesting conversation between sam and nag

నాగ‌చైత‌న్య‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారిన స‌మంత వ‌రుస‌బెట్టి సినిమాలు చేస్తుంది. ఈ ఏడాది ప్ర‌థ‌మార్ధం స‌మంత‌కి బాగా క‌లిసి రాగా, సెకండాఫ్‌లోను మంచి విజ‌యాలు రావాల‌ని కోరుకుంటుంది. అయితే త‌న మామ‌తో ఎంతో స‌రదాగా ఉండే స‌మంత అప్పుడప్పుడు సోష‌ల్ మీడియాలో స‌రదాగా సంభాష‌ణ‌లు జ‌రుపుతుంటుంది. శుక్ర‌వారం స‌మంత న‌టించిన యూట‌ర్న్ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఈ ట్రైల‌ర్‌ని త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో షేర్ చేస్తూ ‘వావ్‌.. నువ్వు సర్‌ప్రైజ్‌ ఇవ్వకుండా ఉండవు కోడలా..! మొత్తం చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌’ అని రాశారు నాగ్.

నాగ్ ట్వీట్‌కి స్పందించిన స‌మంత గంతులేస్తున్న ఎమ్మోజీల‌ని పోస్ట్ చేసి న‌న్ను ఎప్పుడు ఆద‌రిస్తూ, ప్రోత్స‌హిస్తూ స‌పోర్ట్‌గా ఉన్నందుకు ధ‌న్య‌వాదాలు మామ అని కామెంట్ పెట్టింది. ఇక నాగ చైత‌న్య త‌న సతీమ‌ణి న‌టించిన చిత్ర ట్రైల‌ర్‌ని షేర్ చేసి నా లేడి కొత్త సినిమా యూట‌ర్న్‌. రోజు రోజుకి న‌టిగా రాటుదేలుతండ‌డం సంతోషంగా ఉంది. యూనిట్‌కి నా శుభాకాంక్ష‌లు అని తెలిపారు . రానా, సుధీర్ బాబు, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, వంశీ పైడిప‌ల్లి త‌దితరులు యూ ట‌ర్న్ ట్రైల‌ర్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌వీణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో కన్న‌డ రీమేక్‌గా తెర‌కెక్కిన యూ ట‌ర్న్ చిత్ర ట్రైల‌ర్ కొన్ని గంట‌ల‌లోనే 1.5 మిలియ‌న్ వ్యూస్ రాబ‌ట్టడం విశేషం. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన‌ ఈ చిత్రంలో భూమిక , అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత తన పాత్రకి ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.7611
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles