HomeLATEST NEWSintelligent comes on februARY 9

ఇంటెలిజెంట్ వ‌చ్చే నెల‌లో వస్తున్నాడు

Published: Sun,January 21, 2018 12:08 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం వివి వినాయ‌క్ తో పాటు క‌రుణాక‌ర‌ణ్ సినిమాలు చేస్తున్నాడు. అయితే సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రంకి సంబంధించి ప్ర‌స్తుతం ప‌బ్ సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. జ‌న‌వ‌రి 25తో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంద‌ని చెబుతుండ‌గా, ఫిబ్రవ‌రి 9న మూవీ రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. మొద‌ట్లో ఈ మూవీ ధ‌ర్మ‌బాయ్, దుర్గా వంటి టైటిల్స్‌తో ప్ర‌చారం జ‌ర‌గ‌గా, చివ‌రికి ఇంటెలిజెంట్ అనే టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు. తేజూ కెరీర్‌లో ఈ చిత్రం మైల్ స్టోన్‌గా నిలుస్తుందని నిర్మాత‌లు అంటున్నారు. లావ‌ణ్య త్రిపాఠి ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. తమన్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కానుందని స‌మాచారం.
1736
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology