గీత గోవిందం సాంగ్‌కి కనెక్ట్ అయిన యువ‌త- వీడియోలు

Tue,July 24, 2018 10:45 AM

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత వరుస సినిమాలతో మంచి జోరుమీదున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బేనర్ లో గీత గోవిందం అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చిత్రం విభిన్నమైన కథా కథనాలతో ఇంట్రెస్టింగ్ గా రూపొందుతుందని అంటున్నారు. ఆగస్ట్ 15న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ఇటీవ‌ల మొద‌టి సాంగ్ విడుద‌ల చేశారు మేక‌ర్స్‌ . ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ అంటూ సాగే ఈ పాటని సిద్ శ్రీరామ్ పాడారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఈ పాట సంగీత ప్రియులకి ఎంత‌గానో న‌చ్చింది. కేవ‌లం వారం రోజుల‌లోనే 10 మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్ రాబ‌ట్టింది. ముఖ్యంగా ఈ మెలోడీ సాంగ్ యువ‌తని ఎంత‌గానో ఆక‌ర్షించింది. పాట‌ని ఒక్కొక్క‌రు ఒక్కో స్టైల్‌లో త‌మ‌కి నచ్చిన విధంగా పాడి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అంద‌రిని ఆక‌ట్టుకున్న ప‌ది పాపుల‌ర్ వ‌ర్షెన్స్‌పై మీరు ఓ లుక్కేయండి.


3583
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles