గీత గోవిందం ఫ‌స్ట్ లుక్‌కి టైం ఫిక్స్‌

Sun,July 8, 2018 12:10 PM
Inkem Inkem Inkem Kaavaale song released on july 10

అర్జున్ రెడ్డి సినిమా త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో మంచి జోరుమీదున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం గీతా ఆర్ట్స్ బేన‌ర్‌లో గీత గోవిందం అనే సినిమా చేస్తున్నాడు. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న‌ ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చిత్రం విభిన్నమైన కథా కథనాలతో ఇంట్రెస్టింగ్‌గా రూపొందుతుంద‌ని అంటున్నారు. రీసెంట్‌గా చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ ఒక‌టి విడుద‌ల కాగా, ఇది అభిమానుల‌లో ఆస‌క్తి క‌లిగించింది . పోస్ట‌ర్‌ని చూసి అర్జున్ రెడ్డి త‌ర‌హాలో ఈ సినిమాలోను డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయా అని ఫ్యాన్స్ ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ఇక‌ ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి ఒక్కో పాట విడుద‌ల చేసేందుకు స‌న్న‌ద్ద‌మ‌య్యారు మేక‌ర్స్ . ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ అంటూ సాగే ఈ పాటను మంగళవారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసి ప్ర‌క‌ట‌న చేశారు.

1603
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles