'గీత గోవిందం' ఫస్ట్ సాంగ్ విడుదల

Tue,July 10, 2018 04:24 PM

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత వరుస సినిమాలతో మంచి జోరుమీదున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బేనర్ లో గీత గోవిందం అనే సినిమా చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చిత్రం విభిన్నమైన కథా కథనాలతో ఇంట్రెస్టింగ్ గా రూపొందుతుందని అంటున్నారు. ఇటీవల చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదల కాగా, ఇది అభిమానులలో ఆసక్తి కలిగించింది . పోస్టర్ ని చూసి అర్జున్ రెడ్డి తరహాలో ఈ సినిమాలోను డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయా అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. ఇక ఆగస్ట్ 15న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ఒక్కో పాటని విడుదల చేసేందుకు సన్నద్దమయ్యారు మేకర్స్ . ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ అంటూ సాగే ఈ పాటను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట సంగీత ప్రేక్షకుల మనసులని గెలుచుకుంది. మరి ఆ సాంగ్ మీరు విని ఎంజాయ్ చేయండి.


2607
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles