ఇంకేం ఇంకేం ఇంకేం.. ఫుల్ సాంగ్ వీడియో

Tue,October 16, 2018 08:55 AM

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ప‌ర‌శురాం తెర‌కెక్కించిన చిత్రం గీత గోవిందం. గీతా ఆర్ట్స్ బేన‌ర్‌లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. గోపీసుందర్ సంగీతం ప్రేక్ష‌కులు మ‌య‌మ‌రచిపోయేలా చేసింది. చిత్రం విభిన్నమైన కథా కథనాలతో ఇంట్రెస్టింగ్ గా రూపొందింది. కొద్ది రోజులుగా చిత్రం నుండి ప‌లు వీడియో సాంగ్స్ విడుద‌ల చేస్తున్న టీం తాజాగా ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ అంటూ సాగే ఈ పాటని విడుద‌ల చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట‌కి ఎంత‌టి రెస్పాన్స్ వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ పాట సంగీత ప్రియులకి ఎంత‌గానో న‌చ్చింది. సాంగ్ విడుద‌లైన వారం రోజుల‌లోనే 10 మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్ రాబ‌ట్టి అంద‌రు షాక్ అయ్యేలా చేసింది . తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియో విడుద‌ల చేశారు మేక‌ర్స్ . మీరు ఆ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి. చిత్ర ప్ర‌ధాన పాత్ర ధారులు విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మికలు ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. గీత గోవిందం త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.


6185
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles