టీవీల్లో చిన్నారుల‌ డ్యాన్స్ షోలు.. ఛాన‌ళ్ల‌కు హెచ్చ‌రిక‌లు

Tue,June 18, 2019 12:33 PM
Information and Broadcasting Ministry cautions channels over indecent portrayal of children in dance reality shows

హైద‌రాబాద్‌: రియాల్టీ డ్యాన్స్ షోల‌లో పిల్ల‌ల‌ను అస‌భ్యంగా చూపించ‌రాదు అని కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ‌శాఖ ప్రైవేటు టీవీ ఛాన‌ళ్ల‌ను హెచ్చ‌రించింది. డ్యాన్స్ షోలతో పాటు ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో పిల్ల‌ల్ని అనుచితంగా చూపించ రాదు అని స‌మాచార‌శాఖ తెలిపింది. సినిమాల్లో పెద్ద‌లు చేసే డ్యాన్స్ స్టెప్పుల‌ను పిల్ల‌ల‌తో వేయిస్తున్నార‌ని, ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాదు అని స‌మాచార‌శాఖ వెల్ల‌డించింది. పెద్ద‌లు వేసే స్టెప్పులు చిన్న పిల్ల‌ల‌తో చేయించ‌డ‌వ వ‌ల్ల వారిపై తీవ్ర ప్ర‌భావం ఉంటుంద‌ని స‌మాచార మంత్రిత్వ‌శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కేబుల్ చ‌ట్టం ప్ర‌కారం అన్ని ప్రైవేటు ఛాన‌ళ్లు ఈ నిబంధ‌న పాటించాల‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. పిల్ల‌ల ప్రోగ్రాముల్లో ఎటువంటి హానిక‌ర‌మైన భాష కానీ, హింసాత్మ‌క స‌న్నివేశాల‌ను చూపించ‌రాదు.

3752
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles