ఇంద్రసేన ట్రైలర్ వచ్చేసింది

Thu,October 12, 2017 11:10 AM
ఇంద్రసేన ట్రైలర్ వచ్చేసింది

మ్యూజిక్ డైరెక్టర్ నుండి నటుడిగా మారిన విజయ్ ఆంటోని తన సినిమాలను తమిళంతో పాటు తెలుగులోను రిలీజ్ చేస్తున్నాడు. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన విజయ్ తన తాజా చిత్రం ఇంద్రసేనని త్వరలోనే ఆడియన్స్ ముందుకు తేవాలని భావిస్తున్నాడు. సి శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ ని కొద్ది గంటల క్రితం విడుదల చేశారు. ఇందులో విజయ్ ఆంటోని మాస్ అవతారంలో కనిపించగా, ట్రైలర్ ప్రేక్షకులకి కనువిందుగా మారింది. ఇంద్రసేన సినిమాని రాధిక శరత్ కుమార్ తో కలిసి విజయ్ ఆంటోని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి విజయ్ ఆంటోని నిర్మాతగానే కాదు సంగీత దర్శకుడిగా, ఎడిటర్ గా పని చేస్తుండడం విశేషం. మరి తాజాగా విడుదలైన ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

1147

More News

VIRAL NEWS