విలేజ్ రాక్‌స్టార్స్ ఔట్‌

Tue,December 18, 2018 05:21 PM
Indias Village Rockstars film out of Oscar race for 2019

ముంబై: అస్సామీ సినిమా విలేజ్ రాక్‌స్టార్స్‌.. ఆస్కార్ రేస్ నుంచి ఔటైంది. విదేశీ క్యాట‌గిరీలో పోటీకి దిగిన ఈ సినిమా త‌ర్వాత రౌండ్‌కు ఎంపిక కాలేదు. విదేశీ క్యాట‌గిరీ ఫ‌స్ట్ రౌండ్‌లో మొత్తం 87 ఫిల్మ్స్‌ పోటీప‌డ్డాయి. అందులో నుంచి కేవ‌లం 9 సినిమాలు మాత్ర‌మే త‌ర్వాత రౌండ్‌కు సెల‌క్ట్ అయ్యాయి. విలేజ్ రాక్‌స్టార్స్ ఫిల్మ్‌ను రిమా దాస్ డైరక్ట్ చేశారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ సినిమాను ఆస్కార్స్‌కు ఎంపిక చేసింది. కన్నడ ప్రొడ్యూసర్ రాజేంద్ర సింగ్ బాబు నేతృత్వంలోని జ్యూరీ ఈ సినిమాను ఆస్కార్స్‌కు ఎంపిక చేసింది. అస్సాంలోని చయ్యాగావ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. డైరక్టర్ రిమా దాస్ స్వంత ఊరు ఇదే. పేద పిల్లలకు సంబంధించిన కథాంశంతో చిత్రాన్ని తీశారు. విలేజ్ రాక్‌స్టార్స్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. టొరంటోలో జరిగిన వరల్డ్ ప్రీమియర్‌లో ప్రశంసలు అందుకున్నది. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ దీన్ని ప్రదర్శించారు. 65వ జాతీయ పురస్కారాల్లోనూ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకున్నది.

1537
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles