ఇండియ‌న్ 2 ప‌నులు మొద‌లు పెట్టేశారు

Tue,November 13, 2018 09:32 AM
indian2 movie work started

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌, యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాసన్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన భార‌తీయుడు చిత్రం రికార్డులు తిర‌గరాయ‌డంతో 22 ఏళ్ళ త‌ర్వాత ఈ మూవీకి సీక్వెల్ చేస్తున్నారు. తాజాగా ఆ చిత్రం సీక్వెల్‌ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన విషయాన్ని చిత్ర ఆర్ట్‌ డైరక్టర్‌ టి.ముత్తురాజ్‌ ట్విట్టర్‌లో తెలిపారు. రూ.180 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. మొదటి పార్ట్‌లోలాగానే ఇందులో కూడా అవినీతి నిర్మూలన అనే కథాంశంతో సినిమా సాగుతుందని సమాచారం. ఈ క్రమంలోనే సినిమాను తెలుగు, తమిళం, హిందీతోపాటు పలు ఇతర భారతీయ భాషల్లోనూ ఏక కాలంలో తీయాలని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇందులో కమల్‌హాసన్‌కి జోడీగా కాజల్‌ నటిస్తారనే వార్తలొస్తున్నాయి. మరోవైపు నయనతార పేరు కూడా వినిపిస్తోంది. దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రలో, అజయ్‌ దేవ్‌గణ్‌ నెగటివ్‌ పాత్రలో నటిస్తారని సమాచారం. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం 2.0 చిత్ర రిలీజ్ కొన్ని రోజుల త‌ర్వాత సెట్స్ పైకి వెళుతుంద‌ని అంటున్నారు. ‘భారతీయుడు’లో తాను పోషించిన సీబీఐ ఆఫీసర్‌ పాత్రనే సీక్వెల్‌లోనూ నెడుముడి వేణు పోషించనున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలోని నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన విషయాలను త్వరలోనే చిత్రయూనిట్‌ ప్రకటించనున్నట్లు సమాచారం. అనిరుధ్‌ సంగీతం సమకూర్చుతున్నారు.880
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles