సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

Sun,October 21, 2018 01:03 PM
Indian Idol crew member alleges Music Director Anu Malik of sexual harassment

బాలీవుడ్ సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్‌పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఇండియన్ ఐడల్ 5ను ప్రొడ్యూస్ చేస్తున్న సంస్థలో పనిచేసే యువతి అతనిపై ఈ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలతో అతన్ని షో నుంచి జడ్జిగా తప్పించనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలను అను మాలిక్ ఖండించాడు. డానికా డిసౌజా అనే ఆ యువతి మాలిక్‌పై విమర్శలు గుప్పించింది. ఇండియన్ ఐడల్ షూటింగ్ సందర్భంగా తరచూ ఇలాంటి వేధింపులు జరిగేవని, అక్కడి పెద్ద వాళ్లకు కూడా ఈ విషయం తెలిసినా వాళ్లు పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. 2010 నుంచి ఏడాది పాటు ఈ రియాల్టీలో ఆమె పని చేసింది.


ఈ ఘటన కోల్‌కతాలో జరిగింది. మా ప్రొడక్షన్ క్రూలోని ఓ సహచరురాలు కెమెరామాన్, మాలిక్‌తో కలిసి కారులో వెళ్తున్నది. ఆమె తిరిగి వచ్చినపుడు పూర్తిగా షాక్‌లోకి వెళ్లిపోయింది. అక్కడ జరిగిన ఘటనను వివరించింది. మాలిక్ తన తొడపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె చెప్పింది అని డానికా తెలిపింది. ఇప్పటివరకు మొత్తం నలుగురు అమ్మాయిలు అను మాలిక్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అందులో సింగర్లు సోనా మోహపాత్ర, శ్వేతా పండిత్ కూడా ఉన్నారు. తొలిసారి శ్వేతా పండిత్ ఓ ట్విటర్ పోస్ట్‌లో అను మాలిక్‌పై ఆరోపణలు చేసింది. తనకు ముద్దివ్వాల్సిందిగా అతను వేధించాడని ఆమె ఆరోపించింది.2791
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles