పాక్‌లో భారత సినిమాలు విడుదల చేయొద్దు..

Wed,February 20, 2019 04:59 PM
Indian films should never release in Pakistan says Tigmanshu

పాకిస్థాన్‌లో భారత సినిమాలు విడుదల చేయొద్దని బాలీవుడ్ డైరెక్టర్ టిగ్‌మన్షు దూలియా అభిప్రాయపడ్డారు. టిగ్‌మన్షు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం మిలాన్ టాకీస్. ఈ సినిమా పాకిస్థాన్‌లో విడుదల కావడం లేదు. దీంతోపాటు కొత్త సినిమాలు టోటల్ ఢమాల్, లుకా చుప్పి, అర్జున్ పాటియాలా చిత్రాలను కూడా విడుదల చేయడం లేదు. మిలాన్ టాకీస్ ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేశారు.

ఈ సందర్భంగా పాక్‌లో మీ సినిమా రిలీజ్ చేస్తున్నారా అని రిపోర్టర్లు టిగ్‌మన్షును ప్రశ్నించగా..ఆయన సమాధానమిస్తూ మా సినిమాను పాక్‌లో విడుదల చేయడం లేదు. దీనికి రెండు కారణాలున్నాయి. పుల్వామా దాడికి సంఘీభావం తెలపడం ఒకటైతే..పైరసీ ఉద్భవించిందే పాక్‌లో..అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అక్కడ సినిమా విడుదల చేయమని స్పష్టం చేశాడు. ఈ చిత్రంలో అలీ ఫైజల్, శ్రద్దాశ్రీనాథ్, అశుతోష్ రాణా, సికిందర్ ఖేర్ కీలకపాత్రల్లో నటించారు. మార్చి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

పుల్వామాలో ఉగ్రవాదుల దాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ యుద్ధానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పుల్వామా దాడి ఘటనను దేశప్రజలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. పుల్వామా దాడి తర్వాత భారత సినిమాల్లో పనిచేసే పాక్ నటీనటులు, టెక్నీషియన్స్‌ను కూడా తీసుకోవడం లేదు.


మిలాన్ టాకీస్ ట్రైలర్‌..


2345
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles