‘ఇండియన్-2’ ఫ‌స్ట్‌లుక్‌ విడుదల

Wed,January 16, 2019 08:33 AM

సంక్రాంతి పండుగ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ భారతీయుడు-2 చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దిగ్గజ డైరెక్టర్ శంకర్ విడుదల చేశారు. భారతీయుడు-2 సినిమాను గతేడాది కన్ఫర్మ్ చేసినప్పటికీ విలక్షణ నటుడు కమల్‌హాసన్ రాజకీయాలతో.. అటు శంకర్ రోబో-2 సినిమాతో బిజీగా ఉండటంతో సినిమా ఆలస్యం అయింది. కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న ఇండియన్-2 సినిమా జనవరి 18న సెట్స్‌పైకి వెళ్లనుంది. తండ్రి సేనాపతి పాత్రలో కమల్ మర్మకళను ప్రదర్శిస్తున్నట్లు పోస్ట‌ర్‌లో క‌నిపిస్తోంది.


కాజల్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన భారతీయుడు సినిమా భారీహిట్‌గా నిలిచింది. భారతీయుడుకు సీక్వెల్‌గా లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం కమల్ శభాష్ నాయుడు సినిమాలో నటిస్తున్నారు.


3895
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles