న‌య‌న్ మూవీ టీజ‌ర్ విడుద‌ల‌

Fri,May 19, 2017 03:38 PM
Imaikkaa Nodigal teaser released

లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార న‌టిస్తున్న తాజా చిత్రం ఇమైకా నోడిగళ్‌. డిమాంటీ కాలనీ వంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. యంగ్ హీరో అధ‌ర్వ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంతో టాలీవుడ్ భామ రాఖీఖ‌న్నా కోలీవుడ్ కి ప‌రిచ‌యం కానుంది. ఈ చిత్ర టీజ‌ర్ తాజాగా మురుగ దాస్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. క్యామియో ఫిలింస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్‌ హాప్‌ తమిళా సంగీతం అందిస్తుండ‌గా, ఆర్‌డీ.రాజశేఖర్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధిస్తుంద‌ని అంటున్నారు. మ‌రి తాజాగా విడుద‌లైన చిత్ర టీజ‌ర్ పై మీరు ఓ లుక్కేయండి.


919
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS