మ‌రో రీమేక్ చిత్రంతో ప‌ల‌క‌రించ‌నున్న న‌య‌న‌తార‌

Wed,February 6, 2019 08:39 AM
Imaikkaa Nodigal remakes in telugu

సౌత్ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌కి సౌత్‌లోని అన్ని భాష‌ల‌లో ఫుల్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా తెలుగు, త‌మిళ భాష‌ల‌లో న‌య‌న్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌ప్పుడు గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో అల‌రించిన ఈ కేర‌ళ కుట్టీ ప్ర‌స్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌లో ఎక్కువ‌గా న‌టిస్తుంది. అయితే న‌య‌న‌తార న‌టించిన త‌మిళ సినిమాలు అక్క‌డ మంచి హిట్ కావ‌డంతో వాటిని అనువాదం చేసి తెలుగులోను విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఇటీవ‌ల అర‌మ్ అనే త‌మిళ చిత్రాన్ని తెలుగులో క‌ర్త‌వ్యం పేరుతో విడుద‌ల చేశారు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఇక ఇప్పుడు నయనతార‌ సీబీఐ ఆఫీసర్‌గా నటించిన తమిళ చిత్రం ‘ఇమైక్క నోడిగల్’ని తెలుగులో ‘అంజలి సీబీఐ ఆఫీసర్’ పేరుతో విడుదల చేస్తున్నారు. దర్శకుడు ఆర్.అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ క్రైమ్ థ్రిల్లర్ తెర‌కెక్కించారు. అథ‌ర్వ, రాశీఖ‌న్నా కీల‌క పాత్రల్లో న‌టించ‌గా.. బాలీవుడ్ ద‌ర్శకుడు అనురాగ్ క‌శ్యప్ ప్రతినాయకుడిగా న‌టించారు. ప్రముఖ హీరో విజ‌య్ సేతుప‌తి విక్రమాదిత్య అనే అతిథి పాత్రలో కనిపించారు. హిప్ హాప్ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్ర తెలుగు హక్కులను కొనుగోలు చేసిన నిర్మాతలు సిహెచ్ రాంబాబు, ఆచంట గోపీనాథ్.. విశ్వశాంతి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఫిబ్రవ‌రి 22న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.

955
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles