ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్‌ని గుర్తు ప‌ట్టారా ?

Sat,September 29, 2018 12:33 PM

త‌న అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో క‌ట్టిప‌డేసిన గోవా బ్యూటీ ఇలియానా. పోకిరీ చిత్రంలో ఇలియానా న‌ట‌న‌తో పాటు ఆమె లుక్స్‌కి చాలా మంది ఫిదా అయ్యారు. ఆరేళ్ళ క్రితం తెలుగు ఇండ‌స్ట్రీకి బై చెప్పిన నాజుకు భామ త‌న బాయ్ ఫ్రెండ్‌తో క‌లిసి ఫోటో షూట్స్ చేస్తూ ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌చ్చింది. రీసెంట్‌గా ర‌వితేజ చిత్రం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనితో తెలుగు తెర‌కి రీ ఎంట్రీ ఇచ్చింది . శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రం తెర‌కెక్క‌గా ఇటీవ‌ల ఇలియానాకి సంబంధించిన షూటింగ్ పూర్తైంద‌ని స‌మాచారం. ఈ సినిమా కోసం ఇలియానా ఎక్కువ రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్టు తెలుస్తుంది.


తాజాగా ఇలియానా కారు నుండి దిగి త‌న ఇంట్లోకి వెళ్ళే క్ర‌మంలో కెమెరాలో బంధించారు ఫోటోగ్రాఫ‌ర్స్. ఈ ఫోటోల‌లో ఇలియానా గుర్తు ప‌ట్ట‌లేకుండా బొద్దుగా క‌నిపిస్తుంది. స‌న్నగా, నాజూకుగా ఉండే ఇల్లీ బేబి భారీ కాయంతో క‌నిపించే స‌రికి అభిమానులు షాక‌వుతున్నారు. మ‌రి అఅఅ చిత్రంలోను ఇలియానా ఇదే లుక్‌లో క‌నిపిస్తుందా లేదంటే శ్రీను వైట్ల అమ్మ‌డిని స‌న్న‌గా చూపిస్తాడా అనేది చూడాలి. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న అఅఅ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలోని విజువ‌ల్స్ అత్యున్నంగా ఉండేలా నిర్మాత‌లు ప్లాన్ చేశార‌ట‌. చిత్రంలో రెడ్ మాన్‌స్ట్రో కెమెరా, జీస్ సుప్రీమ్ లెన్సెస్‌ల‌ని ఉప‌యోగిస్తున్నార‌ట‌. తెలుగులో 8కే రెజెల్యూష‌న్ కెమెరాతో తెర‌కెక్కుతున్న‌ తొలి చిత్రం అఅఅ అవ‌డం విశేషం.

6700
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles