1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ విధించారు. అప్పటి పరిస్థితుల నేపధ్యంలో బాద్షాహో అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు మిలాన్ లుత్రియా. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ఇషా గుప్తా, ఇలియానా, విద్యుత్ జాంవాల్, సంజయ్ మిశ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కొద్ది రోజులుగా చిత్రంలోని ప్రధాన పాత్రలకి సంబంధించిన పోస్టర్స్ ని విడుదల చేస్తున్న చిత్ర యూనిట్ తాజాగా ఇలియానా లుక్ విడుదల చేసింది. క్లాసిక్ లుక్ లో ఉన్న ఇలియానాని చూసి ఫ్యాన్స్ భారీగా ఆలోచనలు చేస్తున్నారు. బోల్డ్ అండ్ బ్యూటీ ఫుల్ గా ఉన్న ఇలియానా లుక్ అభిమానులకు మాత్రం మంచి కిక్ ఇస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ ని బట్టి చూస్తుంటే సినిమా ఓ రేంజ్ లో ఉంటుందనే అభిప్రాయం అభిమానులలో కలుగుతుంది. 2010లో వచ్చిన వన్స్ అప్ ఆన్ ఏ టైమ్ ఇన్ ముంబై సినిమా తర్వాత అజయ్‌దేవ్‌గన్, ఇమ్రాన్హష్మీ, మిలన్లు మరో సారి సందడి చేయబోతున్నారు. నాలుగో సారి మాలీన్ మరియు అజయ్ కలిసి పనిచేయడం విశేషం. సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.