రామ్ చ‌ర‌ణ్‌కి షాక్ ఇచ్చిన ఇలియానా..!

Sun,November 25, 2018 12:52 PM
ileana demands high for special song

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న 12వ చిత్రంగా బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విన‌య విధేయ రామ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్ మాస్‌ లుక్‌లో క‌నిపించ‌నున్నాడు. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా దీనికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దానయ్య డీవీవీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రంలో వివేక్ ఒబేరాయ్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషిస్తున్నాడు. భ‌ర‌త్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. స్నేహ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు . చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), నవీన్‌ చంద్ర లు నటిస్తున్నారు. ఇక సినిమాకి మ‌రింత క్రేజ్ తీసుకొచ్చేందుకు గాను ఓ స్పెష‌ల్ సాంగ్ కోసం ఇలియానాని తీసుకోవాల‌ని టీం భావించిందట‌. ఇందుకోసం ఇలియానాని సంప్ర‌దిస్తే ఒక్క‌పాట‌కి ఇలియానా అడిగిన పారితోషికం 60 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ట‌. దీంతో ఖంగుతిన్న నిర్మాత‌లు మ‌రో ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. స్టార్ హీరో సినిమాకి కూడా ఇలియానా ఇంత డిమాండ్ చేయ‌డ‌మేంట‌ని అంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. ఆరేళ్ల త‌ర్వాత అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రంతో ఇలియానా టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

6685
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles