ఆ సీక్రెట్స్ అన్నీ చెబితే.. నా కెరీర్‌కు తెరపడినట్లేః ఇలియానా

Tue,March 13, 2018 03:32 PM
ఆ సీక్రెట్స్ అన్నీ చెబితే.. నా కెరీర్‌కు తెరపడినట్లేః ఇలియానా

ఇలియానా డీక్రజ్.. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన ఈ మెరుపుతీగ.. ఇప్పుడు బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. తెలుగులో అందరు స్టార్ హీరోలతో నటించిన ఈ గోవా బ్యూటీ.. హిందీలోనూ అక్షయ్, అజయ్‌దేవ్‌గన్‌లాంటి పెద్ద హీరోల పక్కన చాన్స్ కొట్టేసింది. తాజాగా రైడ్ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నది. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా బాంబే టైమ్స్‌తో మాట్లాడుతూ.. కొన్ని సంచలన విషయాలు చెప్పింది. సినిమా అనే రంగుల ప్రపంచంలో ఆడవాళ్ల లైంగిక దోపిడీ సర్వసాధారణమే. ఎప్పటి నుంచో ఇది జరుగుతున్నా.. వాటిపై ఓపెన్‌గా మాట్లాడేవాళ్లు చాలా తక్కువ. అలాంటివి బయటకు చెబితే తమ కెరీర్‌కే ముప్పని భావిస్తారు. ఇప్పుడు ఇలియానా కూడా అదే అంటున్నది. అది పిరికితనంగా అనిపించవచ్చు కానీ లైంగిక దోపిడీపై బయటకు చెబితే మన కెరీర్లు అక్కడితే ముగిసినట్లే అని ఇలియానా చెప్పింది. టాలీవుడ్‌లో జరిగిన ఓ ఘటన గురించి ఆమె వివరించింది.

కొన్నేళ్ల కిందట దక్షిణాదిలో మూవీ చేస్తున్నపుడు ఓ జూనియర్ ఆర్టిస్ట్ నా సాయం కోరింది. ఓ పెద్ద నిర్మాత తనను కోరిక తీర్చమని అడుగుతున్నారని, ఏం చేయాలని అడిగింది. అయితే అది నేను సలహా చెప్పే విషయం కాదు. నువ్వే ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పాను. చాలా మంది అలా చేశారు. ఈ విషయంలో ముందుకెళ్లాలా వద్దా అనేది నువ్వే డిసైడ్ చేసుకోవాలి అని చెప్పాను. కానీ లైంగిక దోపిడీని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ఓ పెద్ద నటి ఇలాంటి ఆరోపణలు చేస్తే.. అలాంటి పెద్ద నటులే ఎంతోమంది ముందుకు వచ్చి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ దేశంలో నటులను పూజిస్తారు. అలాంటి వాళ్లకు కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పలేదని చెప్పడానికి చాలా మంది మద్దతు కావాల్సి ఉంటుంది అని ఇలియానా చెప్పుకొచ్చింది.

2995

More News

VIRAL NEWS