ఐఫా ఉత్సవం జరిగేది ఆ రోజే

Tue,March 21, 2017 01:39 PM
ఐఫా ఉత్సవం జరిగేది ఆ రోజే

మొన్నటి వరకు నార్త్ లో మాత్రమే జరిగే ఐఫా వేడుక ఇప్పుడు సౌత్ లోను ఘనంగా జరుగుతూ వస్తుంది. గత ఏడాది నుండే సౌత్ ఐఫా అవార్డుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు చెందిన స్టార్స్ అందరు ఈ వేడుకకి హాజరు అయ్యారు. రామ్ చరణ్ , అఖిల్ లు తొలిసారి లైవ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ ఎడిషన్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ వేదికగా మార్చి 28, 29వ తేదీలలో సౌత్ ఐఫా అవార్డుల కార్యక్రమం జరగనున్నట్టు తాజాగా ప్రకటించారు. మార్చి 28న తమిళం, మలయాళ భాషలకు చెందిన సెలబ్రిటీలు హాజరు కానుండగా మార్చి 29న తెలుగు, కన్నడ భాషల సెలబ్రిటీలకు సంబంధించి అవార్డుల వేడుక నిర్వహించనున్నారు . ఇప్పటికే ఈ వేడుకకి సంబంధించి పలు విభాగాలలో నామినేషన్స్ ప్రకటించారు. ఈ సారి సౌత్ ఐఫా అవార్డుల కార్యక్రమాన్ని హోస్ట్ చేసేందుకు ఇద్దరు హీరోలను సెలక్ట్ చేశారు నిర్వాహకులు. అందులో ఒకరు బాహుబలి సినిమాతో తన ఖ్యాతిని ఖండాంతరాలు దాటేలా చేసుకున్న రానా కాగా మరొకరు డబుల్ హ్యట్రిక్ తో ఆడియన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న నాని. ఈ ఇద్దరు హీరోలే ఐఫా వేడుకని హోస్ట్ చేయనున్నారు.

1206

More News

VIRAL NEWS