ఐఫా అవార్డుతో ఓ ఆటాడుకున్న షాహిద్, అలియా భ‌ట్!

Sun,July 16, 2017 05:22 PM
ఐఫా అవార్డుతో ఓ ఆటాడుకున్న షాహిద్, అలియా భ‌ట్!

ఇంట‌ర్నేష‌న‌ల్ ఇండియ‌న్ ఫిలిం అకాడ‌మీ అవార్డు వేడుక న్యూయార్క్ లోని మెట్‌లైఫ్ స్టేడియంలో జూలై 14, 15 తేదీల‌లో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. 18వ ఎడిషన్ వేడుకలకు బాలీవుడ్ స్టార్లంతా తరలివచ్చారు. తార‌ల రాక‌తో ఆ ప్రాంగ‌ణం క‌నుల పండుగ‌గా మారింది. క‌ర‌ణ్ జోహార్, సైఫ్ అలీఖాన్ ఈ కార్య‌క్ర‌మానికి హోస్ట్ లుగా వ్య‌వ‌హ‌రించ‌గా , రీసెంట్ గా అవార్డుల జాబితాని ప్ర‌క‌టించారు. అయితే...బెస్ట్ యాక్ట‌ర్ (మేల్ ) - షాహిద్ క‌పూర్ (ఉడ్తా పంజాబ్ ), బెస్ట్ యాక్ట‌ర్ (ఫీమేల్ )- అలియా భ‌ట్ ( ఉడ్తా పంజాబ్ ) గా అవార్డుల‌ను ద‌క్కించుకోవ‌డంతో ఆనందంతో ఉక్కిరి బిక్కిర‌యిన షాహిద్, అలియా ఐఫా అవార్డుతో ఓ ఆటాడుకున్నారు. వాళ్లు అవార్డును పైకెగ‌రేస్తూ అందుకున్న వీడియోను షాహిద్ త‌న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు.

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

1837
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS