ఐఫా అవార్డు విజేతలు వీరే

Sun,July 16, 2017 12:52 PM
IIFA 2017  Alia Bhatt, Shahid Kapoor win Best Actors

ఇంట‌ర్నేష‌న‌ల్ ఇండియ‌న్ ఫిలిం అకాడ‌మీ అవార్డు వేడుక న్యూయార్క్ లోని మెట్‌లైఫ్ స్టేడియంలో జూలై 14, 15 తేదీల‌లో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. 18వ ఎడిషన్ వేడుకలకు బాలీవుడ్ స్టార్లంతా తరలివచ్చారు. తార‌ల రాక‌తో ఆ ప్రాంగ‌ణం క‌నుల పండుగ‌గా మారింది. క‌ర‌ణ్ జోహార్, సైఫ్ అలీఖాన్ ఈ కార్య‌క్ర‌మానికి హోస్ట్ లుగా వ్య‌వ‌హ‌రించ‌గా , రీసెంట్ గా అవార్డుల జాబితాని ప్ర‌క‌టించారు. బెస్ట్ ఫిలింగా నీర్జా చిత్రానికి అవార్డు ద‌క్క‌గా, బెస్ట్ యాక్ట‌ర్ (మేల్ ) - షాహిద్ క‌పూర్ (ఉడ్తా పంజాబ్ ), బెస్ట్ యాక్ట‌ర్ (ఫీమేల్ )- అలియా భ‌ట్ ( ఉడ్తా పంజాబ్ ), బెస్ట్ డైరెక్ట‌ర్ - అనిరుధ్ రాయ్ చౌద‌రి (పింక్ ), బెస్ట్ స‌పోర్టింగ్ రోల్( మేల్ )- అనుప‌మ్ ఖేర్ (ఎంఎస్ ధోని - ది అన్ టోల్డ్ స్టోరీ), బెస్ట్ స‌పోర్టింగ్ (ఫీమేల్ )- ష‌బానా అజ్మీ (నీర్జా)లు ఐఫా అవార్డ్స్ ద‌క్కించుకున్నారు. ఇక మ్యూజిక్ జ‌ర్నీలో 25 సంవ‌త్స‌రాలుగా అభిమానుల‌ని అల‌రించినందుకు ఏఆర్ రెహ‌మాన్ కి ప్ర‌త్యేక‌ అవార్డు ఇచ్చి స‌త్క‌రించారు. ఇక మిగ‌తా విభాగాల‌కు సంబంధించిన అవార్డుల లిస్ట్ క్రింద పేర్కొన‌బ‌డింది.
1606
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS