సాజిద్ అలా చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే..

Fri,October 12, 2018 05:21 PM
If my brother has behaved he has a lot to atone for says Farahkhan

మీ టూ ఉద్యం రోజురోజుకూ ఉధృతమవుతున్న నేపథ్యంలో..బాలీవుడ్‌ నటి సలోని చోప్రా డైరెక్టర్ సాజిద్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సాజిద్ ఖాన్ నటీమణులు డ్రెస్‌ మార్చుకునే గదుల్లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించేవాడని, వారి డ్రెస్‌ తీసి చూపించమని అడిగేవాడని, వాటిని తాను అడ్డుకోబేతే బయటకు పంపేవాడని సలోని చోప్రా ఆరోపించింది.

ఈ నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫరాఖాన్ (సాజిద్ సోదరి) స్పందించింది. ఇది మా కుటుంబానికి ఎంతో బాధాకరమైన సమయం. కొన్ని క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి మేం కృషి చేయాలి. ఒకవేళ నా సోదరుడు సాజిద్ ఖాన్ ఓ మహిళ పట్ల అలా ప్రవర్తించి ఉంటే..అతడెంతో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఏ మహిళనైనా ఎవరైనా కించపరిచి, ఇబ్బందిపెట్టేటట్లు ప్రవర్తిస్తే..మేము బాధిత మహిళకు మద్దతుగా ఉంటాం. ఇలాంటివి సహించమని ట్వీట్ చేసింది పరాఖాన్. సలోలి చోప్రా ఆరోపణల నేపథ్యంలో సాజిద్ ఖాన్ దర్శకత్వంలో చేస్తున్నహౌస్ ఫుల్ 4 చిత్రాన్ని అక్షయ్ కుమార్ రద్దు కూడా చేసుకున్నాడు.

1691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles