కథ లేకపోతే స్టార్ హీరో సినిమా అయినా నడవదు..

Wed,January 9, 2019 05:53 PM
If a film does not have good story it will not run says karthik subbaraj

ముంబై : ఏ సినిమాకైనా కథ అనేది చాలా ముఖ్యమైందని, స్టార్ హీరోతో సినిమా తీసినా కథ సరిగా లేకపోతే అది నడవడం కష్టమని ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు అన్నాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా పేట చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానుంది.

ఈ సందర్భంగా మీడియాతో చిట్‌చాట్ చేశాడు కార్తీక్ సుబ్బరాజు. ‘సినిమాకు మంచి నటులు, అద్భుత ప్రదర్శన ఇచ్చేవారు కావాలి..దీంతోపాటు సినిమాకు మంచి కథ కూడా ఉండాలి. ఓ స్టార్‌హీరో సినిమాకు మంచి కథ లేకపోతే..అది నడవదు. అందుకే స్టార్లు ఎపుడూ మంచి కథలను ఎంచుకుంటూ ఉండాలి. కథ కన్నా స్టార్‌డమ్ అంత పనిచేస్తదని అనుకోను. మొదటిసారిగా నేను ఎంతో ఇష్టపడే, అభిమానించే ఓ స్టార్‌హీరో సినిమాకు కథ రాశా. సాధారణంగా నేను మొదట కథ రాసుకుంటా. ఆ తర్వాతే స్క్రిఫ్ట్‌ను బట్టి యాక్టర్లను ఎంచుకుంటా. కానీ రజనీకాంత్ లాంటి స్టార్ హీరో కోసం తొలిసారి కథను రాసుకున్నానని’ చెప్పుకొచ్చాడు కార్తీక్‌సుబ్బరాజు.

3415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles