జ‌గ‌న్ చేతుల మీదుగా విడుద‌లైన సుమంత్ మూవీ టీజ‌ర్

Wed,August 22, 2018 08:41 AM
Idam Jagath Teaser released

విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న కథానాయకుడు సుమంత్ నటిస్తున్న వైవిధ్యమైన చిత్రం 'ఇదం జగత్స‌. అంజు కురియన్ ఈ చిత్రంతో నాయికగా పరిచయమవుతుంది. విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుమంత్ కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటువంటి నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని యూనిట్ చెబుతుంది.

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్ర టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇక్కడ మనిషి చావు న్యూసే.. మనిషి జ్ఞాపకాలు న్యూసే.. ప్రేమ న్యూసే.. స్నేహమూ న్యూసే. చేయాలనుకుంటే ప్రపంచంలో ప్రతిదీ న్యూసే.. అది ఎన్ క్యాష్ చేసుకోవడం తెలిసుండాలి.. అవసరమైతే ఆ న్యూస్ క్రియేట్ చేయడం కూడా తెలిసుండాలి.. అది నాకు తెలుసు’ అంటూ న్యూస్ పేరుతో న్యూసెన్స్ చేయడంలో ఎలాగో ట్రిక్స్ చెప్తూ ‘ఇదంజగత్’ టీజర్‌తో వచ్చేశారు హీరో సుమంత్. సుమంత్‌కి జ‌గ‌న్ స్నేహితుడు కావ‌డంతో ఆయ‌న చేతుల మీదుగా టీజ‌ర్ విడుద‌లయింది. శివాజీ రాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, కళ్యాణ్ విథపు, షఫీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

1943
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles