రాజకీయాల్లోకి వస్తే న్యాయం చేయలేను..

Tue,May 14, 2019 10:06 PM
iam too shy iam uncomportable with politics says ajaydevgn


ముంబై: తనకు కొంచెం సిగ్గెక్కువని..అందుకే రాజకీయాల్లోకి రాలేనంటున్నాడు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో కూడా రాణిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘దే దే ప్యార్ దే’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు అజయ్ దేవ్ గన్. రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందా అన్న ప్రశ్నకు తనదైన శైలిలో జవాబిచ్చాడు ఈ నటుడు. రాజకీయ నేత ఎక్కడుంటే అక్కడ జనాలు పెద్ద సంఖ్యలో ఉంటారు. నా చుట్టూ అంతమంది ఉంటే ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉంటుంది. అందుకే నేను రాజకీయాల్లోకి వస్తే నా పనికి న్యాయం చేయలేను. రాజకీయాలనేవి ప్రజల మధ్య ఉంటూ చేయాల్సిన సేవ. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవాళ్లు ప్రజలతో కలిసిపోవాలి. కానీ నాలాగా సిగ్గుపడుతూ ఉంటూ మంచి నాయకుడు కాలేరని చెప్పుకొచ్చాడు.

1710
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles