షారుక్‌ఖాన్‌తో మాట్లాడాలంటే భయమేసేది..

Wed,September 26, 2018 03:57 PM
iam too scared to talk with Sharukh in past says anushka

న్యూఢిల్లీ: సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో షారుక్‌ఖాన్‌తో మాట్లాడాలంటే తనకు చాలా భయమేసేదని బాలీవుడ్ నటి అనుష్క శర్మ చెప్పింది. షారుక్‌తో కలిసి అనుష్క శర్మ రబ్ నే బనాది జోడీ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో జబ్ హ్యారీ మెట్ సెజల్ రాగా..తాజాగా జీరో సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం డిసెంబర్ లో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా మీడియాతో చిట్‌చాట్ చేసింది అనుష్క.

‘నా జీవితంలో నేను ఎక్కువగా విలువ నిచ్చే వ్యక్తి ఉన్నారంటే అది షారుక్‌ఖాన్. నా మొదటి సినిమా అప్పుడు షారుక్ ఎంతో మర్యాదగా ఉండేవారు. ఆయనతో మాట్లాడాలంటే ఎంతో భయమేసేది. ఏదైనా షారుక్ కు చెప్పాలనిపిస్తే..ఆ విషయం అంత ముఖ్యమైందేమి కాదు..ఆయనతో ఎందుకు చెప్పడమని భయపడేదాన్ని. కానీ కొన్నాళ్లకు మా ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ చాలా మెరుగైంది. ఇపుడు షారుక్‌తో మాట్లాడాలంటే అలాంటి ఇబ్బంది లేకుండా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. షారుక్ నటించిన జీరో చిత్రం చిన్న పిల్లాడిలాంటిది. జీరో చిత్రంలో షారుక్ నటనను చూస్తే ఆయనకు నటనంటే ఎంతో మక్కువ ఉందో అర్థమవుతుందని’ కోస్టార్ గురించి తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది అనుష్క.

2283
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles