నేను సురక్షితంగా ఉన్నాను: దీపికాపదుకొనే

Wed,June 13, 2018 06:56 PM
Iam safe Deepika says on fire accident

ముంబై : ఇవాళ ముంబైలోని బ్లూ మౌంట్స్ టవర్స్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇదే భవనంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నివసిస్తుండటంతో..ఆమెకు ఏమైనా జరిగిందేమో అని అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఈ ప్రమాదంలో తనకేమి జరగలేదని ట్విట్టర్ ద్వారా తెలిపింది దీపికా.

‘నేను సురక్షితంగా ఉన్నా. అందరికీ ధన్యవాదాలు. భవనంలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న అగ్నిమాపక సిబ్బంది కోసం అందరూ ప్రార్థనలు చేయండని’ అభిమానులను ట్విట్టర్ ద్వారా కోరింది దీపికాపదుకొనే.


2454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS