అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా..

Mon,March 18, 2019 07:58 PM
Iam looking for opportunities says Akshaykumar


కామెడీ, క్లాస్, మాస్, దేశభక్తి, సందేశాత్మక చిత్రాలు.. ఇలా అన్ని జోనర్లలో నటించి అందరిని మెప్పించాడు బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్. మూడు దశాబ్దాల సినీ కెరీర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన అక్షయ్..ప్రెస్ మీట్ లో పలు విషయాలను అందరితో షేర్ చేసుకున్నాడు.

'నేను వెళ్లే దారి చాలా పెద్దది. ఇప్పటికీ నేను చేయాల్సింది ఎంతో ఉంది. నేను పని కొనసాగించాలనుకుంటున్నా. నేను ఎక్కడా ఒక్క విషయం దగ్గరే ఆగిపోను. ప్రత్యేక ఇమేజ్ అంటూ ఏం పెట్టుకోను. అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నా. ఇప్పటీకీ నా గురించి నేను తెలుసుకుంటూనే ఉన్నాను. నా కోసం నేను పనిచేయడానికి నాకు చాలా సమయం ఉంది. ప్రస్తుతం హౌస్ ఫుల్ 4 చిత్రం చేస్తున్నా. దీని తర్వాత హార్రర్ కామెడీ చేయబోతున్నా. అనంతరం సూర్యవంశీ చిత్రం చేస్తా. నాకు విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాలు చేయాలని ఉంది. అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు' అక్షయ్ కుమార్.

2293
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles