నేను పోలీస్ కస్టడీలో ఉన్నా: వీడియోలో వర్మ

Sun,April 28, 2019 03:34 PM
Iam In police custody now says ramgopal varma

తాను పోలీస్ కస్టడీలో ఉన్నానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. నిజం చెప్పేందుకు ప్రయత్నించినందుకు నేనిపుడు పోలీస్ కస్టడీలో ఉన్నా. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజ్వాస్వామ్యం అనేదే లేదని వర్మ ట్వీట్ చేశాడు.

ఎయిర్‌పోర్టులో తీసిన వీడియోలో పలు విషయాలు చెప్పాడు వర్మ. నా కారులో నుంచి అందరినీ కిందికి దింపి..నన్ను బలవంతంగా వేరే కారులో ఎక్కించి..విజయవాడలో ఉండటానికి వీల్లేదంటూ నన్ను ఎయిర్‌పోర్టులో తీసుకువచ్చి వదిలేశారు. ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చిందనేది నాకు తెలియదు. శాంతి భద్రతల విషయంలో పోలీసులకు బాధ్యత ఉంది. విజయవాడ రావటానికి వీల్లేదు..విజయవాడలో ఏ హోటల్‌లో ఉండటానికి వీల్లేదని చెప్పడమేంటో మాకర్థం కాలేదు. నేను, నా నిర్మాత ఎంత అడిగినా మాకు సమాధానమివ్వడం లేదు. ఇలా మమ్మల్ని ఎయిర్‌పోర్టులో వదిలేశారు. తర్వాత అప్‌డేట్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను మే 1న ఏపీలో విడుదల చేయనున్నట్లు శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. లక్ష్మీస్ ఎన్ టి ఆర్ సినిమా ప్రెస్ మీట్ విజయవాడ నోవాటెల్ హోటల్ లో నిర్ణయించాం, కానీ ఆ హోటల్ వాళ్లకి ఎవరో వార్నింగ్‌ ఇవ్వటం మూలాన భయంతో కేన్సిల్ చేశారు. ఈ విపరీత పరిస్థితుల్లో ట్రై చేసినా అన్ని హోట్టల్స్‌, క్లబ్బుల, మేనేజిమెంట్లు, మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి భయంతో జడిసి పారిపోయారు .ఈ నేప‌థ్యంలో పైపుల రోడ్డులో ఎన్టీఆర్ స‌ర్కిల్ దగ్గర నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నానని వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే.

3179
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles