నేను ప్రజల కోసం పోరాడుతున్నా: ప్రకాశ్ రాజ్

Tue,April 16, 2019 11:40 AM
Iam fighting for people says actor prakashraj


ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ బెంగళూరు సెంట్రల్ లో ప్రకాశ్ రాజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తాను ఎవరికీ వ్యతిరేకంగా పోరాడటం లేదని, ప్రజల కోసమే తన పోరాటమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి మెజారిటీ వస్తే వారే విజేతలని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు (ఓటర్లు)సరైన నాయకుడిని ఎన్నుకుంటే, అది ప్రజల విజయం. ఒకవేళ అసమర్థుడైన నాయకుడిని ఎన్నుకుంటే అది ప్రజల వైఫల్యమేనని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు.

1516
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles