కథ విన్నప్పుడే అద్బుతంగా అనిపించింది..

Tue,April 23, 2019 07:38 PM
i wondered when here jersy story says nani

తనకు జెర్సీ క‌థ విన్న‌ప్పుడే అద్భుతంగా అనిపించిందన్నాడు న్యాచురల్ స్టార్ నాని. నిర్మాత దిల్‌రాజు హైద‌రాబాద్‌లో సోమ‌వారం సాయంత్రం అప్రిషియేష‌న్‌ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ..సినిమాలో అర్జున్‌కి బీసీసీఐ ఈవెంట్ ప్లాన్ చేసిన‌ట్టు, దిల్‌రాజుగారు అప్రిషియేష‌న్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఆయ‌న‌కు మంచి సినిమా న‌చ్చిన‌ప్పుడు చాలా బాగా ఎంక‌రేజ్ చేస్తారు. సినిమా ఉద‌యం ఆట చూసి దిల్‌రాజుగారు ఫోన్ చేశారంటేనే సినిమా హిట్ అయిన‌ట్టు. ఈ సినిమాకు కూడా ఉద‌యం ఇంటి గేటు నుంచి అడుగు బ‌య‌ట‌పెడుతుంటే దిల్‌రాజుగారు ఫోన్ చేశారు. నాకు క్లారిటీ వ‌చ్చిందని నాని అన్నాడు.

నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అంద‌రికీ థాంక్స్ చెప్పా. గౌత‌మ్ క‌థ‌లో ఎంత నిజాయితీ ఉందో..ఆయ‌న‌లో కూడా అంతే నిజాయితీ ఉంటుంది. మ‌న‌సులోనుంచి వ‌చ్చినది జెన్యూన్ క‌థ అయిన‌ప్పుడు త‌ప్ప‌కుండా మేజిక్ క్రియేట్ అవుతుంద‌ని న‌మ్ముతాను. గౌత‌మ్ స్వ‌త‌హాగా చాలా హానెస్ట్ గా ఉన్నాడు. ప్రారంభం నుంచి ఇప్ప‌టిదాకా అలాగే ఉన్నాడు. గౌత‌మ్ చాలా పెద్ద డైర‌క్ట‌ర్ అవుతాడు అని న‌మ్మాను. మొదటి నుంచి చెప్పా. గౌత‌మ్ నాలో అర్జున్‌ని చూసినందుకు ధన్యవాదాలు అని అన్నాడు నాని.

2825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles