భోజ్ పురిలో మోదీ బయోపిక్ తీస్తా..

Sun,May 12, 2019 07:46 PM
I Will make Modi biopic in Bhojpuri says Ravi Kishan


గోరఖ్ పూర్ : ప్రధాని నరేంద్రమోదీ బయోపిక్ ను బోజ్ పురిలో తీస్తానని ప్రముఖ సినీ నటుడు, బీజేపీ గోరఖ్ పూర్ లోకసభ అభ్యర్థి రవికిషన్ అన్నారు. ఈ విషయమై రవికిషన్ మాట్లాడుతూ..బోజ్ పురి ప్రజలు ప్రధాని మోదీ లాంటి లీడర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరముంది. అందుకే భోజ్ పురిలో బయోపిక్ తెరకెక్కిస్తా. అంతేకాకుండా స్వామి వివేకానంద, అటల్ బిహారి వాజ్ పేయి జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు తీయాలనుకుంటున్నానని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినీ కెరీర్ గురించి రవికిషన్ స్పందిస్తూ..తాను రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లో కూడా పనిచేస్తానని చెప్పారు. నటుడిగా, దర్శకుడిగా సినిమాలకు పనిచేయడం ఆపను. ఎన్నికల తర్వాత గోరఖ్ పూర్ లో స్టూడియో నిర్మిస్తా. సామాజిక సేవతోపాటు నటన కూడా కొనసాగిస్తానని చెప్పారు.

1356
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles