రిటైర్‌మెంట్ తర్వాత నిర్మాతగా మారుతుందట..

Sun,October 14, 2018 10:29 PM
i will become a producer after retirement says Hansika

చిత్ర నిర్మాణాన్ని చేపట్టాలనేది తన చిరకాల కోరిక అని చెబుతోంది హన్సిక. నటన నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న తర్వాత తప్పకుండా నిర్మాతగా మారుతానని అంటున్నది. గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె తమిళ సినిమాలపై మాత్రమే దృష్టిసారిస్తున్నది. ప్రస్తుతం మహా అనే తమిళ సినిమాతో యాభై చిత్రాల మైలురాయికి చేరుకుంది. హన్సిక మాట్లాడుతూ వయసు, అనుభవం నాలో చాలా పరిణితిని తీసుకొచ్చాయి.

ఏ గమ్యాన్ని చేరుకోవాలని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానో అది నెరవేరింది. అందుకే ఇప్పుడు సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాను.. ఒకప్పుడు ఏడాదికి ఎనిమిది సినిమాలు చేశాను. ఇప్పుడు సెలెక్టివ్‌గా నా మనసుకు నచ్చిన మంచి కథలను మాత్రమే ఎంచుకుంటున్నాను ప్రస్తుతం నాయకానాయికల పరిస్థితి సేల్స్‌మెన్‌లా మారిపోయింది. తాము నటించిన సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

పోటీ ప్రపంచంలో రాణించాలంటే అవన్నీ చేయక తప్పడం లేదు. కమర్షియల్ సినిమాలకే నా తొలి ప్రాధాన్యత. ప్రయోగాలతో పోలిస్తే అవే ఎక్కువ పేరు, స్టార్‌డమ్‌ను తీసుకొస్తాయి. రిస్క్ తక్కువగా ఉంటుంది. మంచి కథలు దొరికితే తప్పకుండా మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తాను అని తెలిపింది.

4091
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles