నాని సినిమా నుండి మ‌రో వీడియో సాంగ్ ప్రోమో

Tue,April 10, 2018 12:29 PM
I Wanna Fly Video Teaser released

నేచుర‌ల్ స్టార్ నాని నటించిన కృష్ణార్జున యుద్ధం చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 12న విడుద‌ల‌కి సిద్ధ‌మైంది. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి యూ/ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. ఈ మూవీలో కృష్ణుడు పాత్ర‌లో మాస్ లుక్‌తో క‌నిపించ‌నున్న నాని, అర్జున్ పాత్ర‌లో రాక్‌స్టార్‌గా క‌నిపించ‌నున్నాడు.మూవీ రిలీజ్ టైం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతోప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు మేక‌ర్స్‌. ఈ క్ర‌మంలో చిత్రానికి సంబంధించి వీడియో సాంగ్ ప్రోమోస్‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా ఐ వ‌న్నా ఫ్లై.. అంటూ సాగే పాట వీడియోని విడుద‌ల చేశారు. హిప్ హాప్ త‌మీజా సంగీతంలో రూపొందిన ఈ పాట సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. శ్రీజో లిరిక్స్ అందించిన ఈ పాట‌ని ఎల్‌వీ రేవంత్‌, సంజీత్ హెగ్డే పాడారు.. మ‌రి ఈ వీడియో సాంగ్ మీరు చూసి ఎంజాయ్ చేయండి. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గరపాటి, హరీశ్‌ పెద్ది ఈ సినిమాకు నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా అనుపమ పరమేశ్వరన్‌, రుక్సార్‌ మిర్‌ నటించిన సంగ‌తి తెలిసిందే.

2082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles