పవన్ కల్యాణ్ కోసం కథ రాసుకున్నా..కానీ

Mon,November 11, 2019 10:20 PM


ముంబై: విజయ్ చందర్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘విజయ్ సేతుపతి’. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. ఈ నెల 15న విడుదల కానుంది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. దర్శకుడు సముద్ర చిత్ర ట్రైలర్ ను విడుదల చేశాడు. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ చందర్ మాట్లాడుతూ..విజయ్ సేతుపతి సినిమా కథను పవన్ కల్యాణ్ కోసం రాశానన్నాడు. అయితే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పనులతో బిజీగా ఉండటంతో..అదే కథను తమిళంలో విజయ్ సేతుపతితో తీశానని చెప్పాడు. ఇక్కడ పవన్ కల్యాణ్ కున్నట్లుగానే తమిళంలో విజయ్ సేతుపతికి మాస్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ సేతుపతి కథను విని ఒకే చెప్పడంతో సెట్స్ పైకి వెళ్లిందని అన్నాడు. ప్రజాసమస్యలపై పోరాడే వ్యక్తిగా విజయ్ సేతుపతి కనిపిస్తాడని, డ్యుయల్ రోల్ లో సందడి చేస్తాడని చెప్పాడు.

1407
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles