యాక్షన్‌తో షేక్ చేసేందుకు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న ఉపేంద్ర‌

Tue,March 12, 2019 09:13 AM
I LOVE YOU Telugu Movie Official Teaser RELEASED

యాక్ష‌న్ చిత్రాల‌కి కేరాఫ్ అడ్రెస్ ఉపేంద్ర‌. ఒక‌ప్పుడు ఆయ‌న చిత్రాల‌కి భారీ ఆద‌ర‌ణ ఉండేది. ఈ మ‌ధ్య సినిమాల‌ని కాస్త త‌గ్గించిన ఉపేంద్ర రాజ‌కీయాల‌తో బిజీ అయ్యాడు. తాజాగా ఐల‌వ్‌యూ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌య్యాడు. న‌న్నే ప్రేమించు అనేది ఈ చిత్ర ఉప‌శీర్షిక‌. ఆర్ చంద్రు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఉపేంద్ర‌, డింపుల్ క్వీన్ ర‌చిత రామ్, సోను గౌడ‌, బ్ర‌హ్మానందం ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఈ చిత్ర టీజర్ తాజాగా విడుద‌లైంది. ఇందులో యాక్ష‌న్‌తో పాటు రొమాంటిక్ స‌న్నివేశాలు ఉన్నాయి. టీజర్ ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్ .

2224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles