వారి కూతురిని కాకపోవడం వల్లే సినిమాలు కోల్పోయా..

Sun,July 15, 2018 05:19 PM
I lost out on films because I was not so-and-so daughter says Taapsee

ముంబై: ఝమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరపై మెరిసింది ఢిల్లీ సుందరి తాప్సీ. ఆ తర్వాత పలు తెలుగు హిట్, తమిళ హిట్ సినిమాల్లోనూ కనిపించింది. పింక్ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్‌తో కలిసి నటించే అరుదైన అవకాశాన్ని కొట్టేసింది. నామ్ షబానా, జుద్వా 2 చిత్రాల్లోనూ తనదైన నటనను ప్రదర్శించింది తాప్సీ. చాలా సినిమాల్లో నటించేందుకు తాప్సీకి నేరుగా అవకాశం రాకుండా..వేరే వాళ్ల స్థానంలో అవకాశం వచ్చిందట. ఈ విషయాన్ని తాప్సీ మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో షేర్ చేసుకుంది.

నాకు సినీ పరిశ్రమతో సంబంధం లేకపోవడం, గాఢ్‌పాదర్ ఎవరూ లేకపోవడం వల్ల చాలా సినిమాల్లో నేరుగా కాకుండా..ఇతరుల స్థానంలో అవకాశాలు వచ్చాయి. సంబంధం లేని కారణాలతో జరిగే తిరస్కరణకు నేను సిద్ధమయ్యా. పాత్రకు సరిపోతానా ? లేదా? అన్న విషయం తప్ప..మిగితా ఏ కారణం వల్లనైనా సినిమా కోల్పోతే నాకు ఆశ్చర్యమేమి కలగదు. ఎందుకంటే నేను సినీ పరిశ్రమకు చెందిన వారి కూతురినో, సోదరినో కాదు. వేరొకరి స్థానంలో నన్ను ఎంపిక చేస్తే నేను ఆ జోన్‌లోకి వెళ్లిపోతా. ఎందుకంటే ఇది నా లక్ష్యం. ఈ పని చేసేది నేనొక్కదాన్నే. నా రెండు, మూడు సినిమాలు బాగా లేకపోతే..ఎవరూ నాకు అవకాశం ఇవ్వరు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే అభద్రతా భావంతో ఉంటా. ఇవన్నీ పక్కన పెడితే నా వరకు నేను చిన్న విజయం అయినా ఎంజాయ్ చేస్తున్నా. నా ప్రయాణాన్ని థ్రిల్లింగ్‌గా కొనసాగిస్తున్నానని చెప్పుకొచ్చింది తాప్సీ.

8216
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles