నాకు తెలంగాణ అంటే ఇష్టం: పవన్ కల్యాణ్

Tue,August 13, 2019 07:53 PM


హైదరాబాద్ : ప్రపంచాన్ని శాసించే సినిమాలు తెలుగు నుంచి వస్తాయని జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రముఖ రచయిత తెలకపల్లి రవి రచించిన ‘మన సినిమాలు..అనుభవాలు- చరిత్ర-పరిణామం’ పుస్తకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..మహానటి లాంటి సినిమాలు ఎంతోమందికి ప్రేరణ కలిగించాయని.. ఇంకా చాలా మంచి సినిమాలు రావాలన్నారు. తనకు తెలంగాణ అంటే ఇష్టమని..ఇష్టం కోసమే మాట్లాడుతానని..రాజకీయం కోసం తెలంగాణ గురించి మాట్లాడనని పవన్ కల్యాణ్ చెప్పారు. తెలంగాణ నా రక్తం, నా గుండెల్లో ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

3168
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles