నా వంతుగా రూ.25 లక్షలు విరాళం ఇస్తా: అల్లుఅర్జున్

Mon,August 13, 2018 07:57 PM
I hereby pledge to donate 25 lacks to kerala cm relief fund says allu arjun

హైదరాబాద్: కేరళలో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 39 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రాథమిక అంచనా ప్రకారం 20 వేల ఇండ్లు వర్షాలకు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తనను ఎంతగానో ఆదరించిన కేరళ ప్రజలు, అభిమానులకు తనవంతుగా సాయం చేస్తానని ప్రకటించాడు టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్.

నాపై అమితమైన ప్రేమాభిమానాలు చూపించే కేరళ ప్రజలకు నా హృదయంలో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. వారికి జరిగిన నష్టం అపారం. వారికి అండగా నిలిచేందుకు నా వంతుగా రూ.25 లక్షలు విరాళంగా అందజేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా. ప్రేమతో మల్లు అర్జున్..అని ట్వీట్ చేశాడు బన్నీ. అల్లు అర్జున్ నటించిన సినిమాలకు తెలుగుతోపాటు మలయాళంలో మంచి క్రేజ్ ఉంటుంది. బన్నీ ప్రతీ సినిమా అక్కడ కూడా విడదలై మంచి విజయాన్ని అందుకుంటుంది.


9850
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles