‘దంగల్‌’ స్టార్ అమీర్‌ఖాన్ సినిమాలు చూడలేదట..

Thu,October 12, 2017 05:08 PM
‘దంగల్‌’ స్టార్ అమీర్‌ఖాన్ సినిమాలు చూడలేదట..


ముంబై: బాలీవుడ్ స్టార్అమీర్‌ఖాన్ నటించిన ‘దంగల్‌’లో రెజ్లర్ గీతాఫోగట్ పాత్రలో నటించింది జైరా వసీమ్. దంగల్ సినిమలో అద్భుతమైన నటనకు జైరా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది. అమీర్‌ఖాన్‌తో నటించి ఇంటర్నేషనల్ స్థాయిలో స్టార్‌డమ్ సంపాదించింది. అయితే జైరా వసీమ్ మాత్రం ఇంతవరకు ఎపుడూ అమీర్‌ఖాన్ సినిమాలు చూడలేదట. ఇటీవలే ఈ విషయాన్ని ఓ ఇంటర్వూలో వెల్లడించింది జైరా.

తాను ఎపుడూ యాక్టర్‌ను అవుతానని అనుకోలేదంది జైరా వసీమ్. నాకు సినిమాలు చూడటం అంటే ఇష్టం ఉండదు. థియేటర్‌కి వెళితే సినిమా పూర్తయే వరకు ఉండలేను. నేను చూసిన చివరి సినిమా దంగల్. ఈ సినిమా కాకుండా ఇంతవరకు అమీర్‌ఖాన్ సినిమాలు కూడా చూడలేదు. కానీ ఆయనతో నటించడానికి ఎంతో ఎక్సయిటింగ్‌గా ఎదురుచూస్తుంటా. దంగల్‌కు ముందునుంచే అమీర్‌ఖాన్‌తో చాలా బాగా కలిసిపోయాను. దంగల్ తర్వాత అమీర్‌ఖాన్ మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. దంగల్ సినిమా గొప్ప విజయాన్ని సాధించి..స్టార్‌డమ్ వచ్చినప్పటికీ నేను సాధారణ జీవితాన్ని గడుపుతున్నా. సక్సెస్‌కు నిర్వచనమంటూ లేదనేది నా అభిప్రాయం. ఒకవేళ సక్సెస్ ను నెత్తికెక్కించుకుంటే మరుక్షణమే పతనం ఖాయమని చెప్పుకొచ్చింది జైరా వసీమ్. ప్రస్తుతం అమీర్‌ఖాన్ నటిస్తున్న ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ మూవీలో జైరా వసీమ్ కీలకపాత్రలో నటిస్తోంది.

1208
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS