‘అక్కినేని’ పేరుతో బాధ్యత పెరిగింది : సమంత

Thu,October 12, 2017 05:47 PM
‘అక్కినేని’ పేరుతో బాధ్యత పెరిగింది : సమంత


హైదరాబాద్ : టాలీవుడ్ నటి సమంత ఇప్పుడు అక్కినేని సమంతగా మారిన విషయం తెలిసిందే. నాగార్జున ముఖ్య పాత్రలో సమంత నటించిన ‘రాజుగారి గది 2’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నాగార్జున అండ్ చిత్రయూనిట్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అక్కినేని సమంతగా మీరు ఎలా ఫీలవుతున్నారని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ..అక్కినేని పేరుతో తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పింది సమంత. అక్కినేని అభిమానుల అంచనాలకు అనుగుణంగా నడుచుకుంటానని చెప్పింది సమంత. తన భర్త, కుటుంబం ఎలాంటి ఆంక్షలు విధించకుండా సినిమాలు చేసేందుకు తనకు ఎంతో స్వేచ్చనిచ్చారని తెలిపింది సమంత. ఓంకార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రాజుగారి గది 2 సినిమాలో సమంత లాయర్ గా కనిపించనుంది
sam-pressmeet

1943
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS