పా రంజిత్‌తో రాజకీయాలపై చర్చించా: రాహుల్‌గాంధీ

Wed,July 11, 2018 02:44 PM
I discussed about politics with pa ranjith says rahulgandhi


న్యూఢిల్లీ: తమిళ డైరెక్టర్ పా రంజిత్, నటుడు కలైయారసన్ నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. రాజకీయం, సినిమాలు, సమాజంలో నెలకొన్న పరిస్థితులపై పా రంజిత్‌తో రాహుల్ గాంధీ చర్చించారు. ఈ విషయాన్ని రాహుల్‌గాంధీ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.

‘మద్రాస్, కబాలి, కాలా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు పా రంజిత్, నటుడు కలైయారసన్‌ను నిన్న కలిశాను. ప్రస్తుత రాజకీయాలు, సినిమాలు, సమాజం అంశాలపై చర్చించాం. వారిద్దరితో చర్చించడం చాలా సంతోషంగా ఉందని’ రాహుల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా వారిద్దరితో కలిసి దిగిన ఫొటోను రాహుల్ షేర్ చేశారు. కలైయారసన్, పా రంజిత్ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వచ్చిన మద్రాస్ సినిమాకు పనిచేశారు.1523
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS