అమెరికా అధ్యక్షుడు ఇచ్చే విందుకు హాజరవుతా: ప్రియాంక చోప్రా

Thu,April 28, 2016 11:12 AM

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్‌హౌజ్ కరస్పాండెంట్ డిన్నర్-2016కు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఈ విందుకు ఆమె హాజరవుతారో లేదో అన్న ఉత్కంఠకు ప్రియాంక తెర దించారు. త్వరలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇవ్వబోయే విందుకు తాను హాజరవుతున్నానని ధృవీకరించారు. తన అభిమాని ట్విట్టర్‌లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ విషయం తెలిపారు. ఈ విందుకు ప్రియాంక చోప్రాతోపాటు విల్‌స్మిత్, ఆయన భార్య జదా పింకెట్ స్మిత్, కెర్రీ వాషింగ్టన్, షోండా రైమ్స్, ప్రముఖ కిమ్ కర్దాషియన్ సోదరి కెందాల్ జెన్నర్ తదితరులు హాజరుకానున్నారు.

1726
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles