నేను గర్భవతిని కాదు.. వస్తే దాచలేను కదా!

Mon,December 17, 2018 04:47 PM
I am not pregnant says Anushka Sharma

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ.. క్రేజీ క్రికెట్, బాలీవుడ్ జంటల్లో వీళ్లదీ ఒకటి. గతేడాది డిసెంబర్‌లో వీళ్లు పెళ్లి చేసుకున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ఇటలీ వెళ్లి ఏడడుగులు వేశారు. ఈ మధ్యే ఫస్ట్ యానివ‌ర్స‌రీని కూడా ఆస్ట్రేలియాలో సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే కొంతకాలంగా అనుష్క గర్భవతి అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని అనుష్కను అడిగితే.. అదేమీ లేదంటూ కొట్టి పారేసింది. అందులో ఏమాత్రం నిజం లేదు అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క చెప్పింది.

యుక్త వయసులోనే నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు గర్భవతిని అయితే నేను దాచలేను కదా. పెళ్లి విషయాన్ని దాచి పెట్టొచ్చేమోగానీ.. గర్భాన్ని దాచలేము కదా అని అనుష్క ప్రశ్నించింది. ఎవరో ఒకరు ఏదో ఒక పుకారు పుట్టిస్తారు. కొంతకాలం తర్వాత అది నిజం కాదని తెలుసుకొని వదిలేస్తారు. మరో పెళ్లయిన జంట వెనుక పడతారు. కేవలం వార్తలను పుట్టించడానికే ఇలాంటివి చేస్తుంటారు అని అనుష్క క్లాస్ పీకింది. గతేడాది డిసెంబర్ 11న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని అనుష్క శర్మ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ జీరో ప్రమోషన్‌లో అనుష్క బిజీగా ఉంది.

9175
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles