కంగ‌నా బయోపిక్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను: బెబో

Sat,February 23, 2019 09:59 AM
I am excited to watch Kangana Ranauts biopic saysa kareena

సంచ‌లనాల‌కి కేంద్ర‌బిందువుగా ఉండే కంగ‌నా ర‌నౌత్ రీసెంట్‌గా మ‌ణిర్ణిక అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి న‌టిగానే కాదు ద‌ర్శ‌కురాలిగా కూడా ప‌ని చేసింది కంగ‌నా. మ‌ణిక‌ర్ణిక చిత్రం కొంత భాగం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, మిగ‌తా భాగాన్ని కంగ‌నా కంప్లీట్ చేసింది.ఆ అనుభ‌వంతోనే ఇప్పుడు త‌న బ‌యోపిక్‌ని తానే తెర‌కెక్కిస్తానని ఇటీవ‌ల సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది కంగానా. త‌న జీవితంలో వ‌చ్చిన ఎత్తు, ప‌ల్లాలు అలానే ఎలాంటి గాడ్ ఫాద‌ర్ లేకుండా ఓ మారుమూల ప్రాంతం నుండి వ‌చ్చిన తాను ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఎలా మారింది అనే అంశాల‌ని బ‌యోపిక్‌లో చూపించ‌నుంద‌ట‌.

కంగ‌నా బ‌యోపిక్‌కి సంబంధించి బాలీవుడ్ బెబో క‌రీనా క‌పూర్ స్పందించింది. కంగ‌నా బ‌యోపిక్ కోసం నేను ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. ఉత్త‌మైన న‌టీమ‌ణుల‌లో ఆమె ఒక‌రు. కంగనాని నేను ఎప్ప‌టికి ప్రేమిస్తూనే ఉంటాను. అద్భుత‌మైన న‌టిగాను, తెలివైన మ‌హిళ‌గా గుర్తింపు తెచ్చుకుంది కంగానా. ఆమె న‌టించిన మ‌ణికర్ణిక చిత్రం ఇంకా చూడ‌లేదు. వీలు చూసుకొని ఆ సినిమా చూస్తాను అని క‌రీన్ క‌పూర్ తెలిపింది. కంగ‌నా బయోపిక్ ఈ ఏడాది చివ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుండ‌గా, ఇందులో ఏఏ అంశాలు చూపించ‌నున్నారు అనే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది.

795
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles