ఆదేశ్ పరిస్థితిపై ఎంతో కలత చెందా:ఏఆర్ రెహమాన్

Fri,September 4, 2015 05:07 PM
I am devastated on critically ill AadeshShrivastav


ముంబై: బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ ఆదేశ్ శ్రీవాత్సవ క్యాన్సర్ బారిన పడటం ఎంతో కలచి వేసిందని ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్న ఆదేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడం బాధాకరమని అన్నారు. దేవుడి ఆశీస్సులతో ఆదేశ్ ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్టు ట్విట్టర్‌లో రహమాన్ సందేశాన్ని పోస్ట్ చేశారు.

క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆదేశ్‌కు 45రోజులుగా ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రి వైద్యులు చికిత్సనందిస్తున్న సంగతి తెలిసిందే. ఆదేశ్‌ను ఐశ్వర్యరాయ్, షారుఖ్‌ఖాన్‌తోపాటు పలువురు గాయకులు, సినీ ప్రముఖులు ఆస్పత్రికెళ్లి పరామర్శించారు. చల్తే చల్తే, బాబుల్, బగ్‌బాన్, కబీ ఖుషి కబీ ఘమ్, రాజ్‌నీతి, దేవ్ తో పాటు పలు సినిమాలకు ఆదేశ్ మ్యూజిక్ అందించారు.

2441
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles