స్టెప్ప‌లతో కేక పెట్టించిన క‌త్రినా కైఫ్‌

Thu,December 13, 2018 08:37 AM
Husn Parcham Video Song released

బార్బీగార్ల్ క‌త్రినా కైఫ్ త‌న అందంతోనే కాక స్టెప్పుల‌తో యూత్‌కి మాంచి కిక్ ఇచ్చింది. షారూఖ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన జీరో చిత్రంలో బ‌బితా కుమారి అనే పాత్ర‌లో మ‌ద్యానికి బానిసైన సినీ స్టార్ పాత్ర‌లో ఆమె క‌నిపించ‌నున్నారు. క‌త్రినా అంటే షారూఖ్‌కి ఎన‌లేని ప్రాణం. ఆమె వాళ్ళ ఊరికి వ‌స్తుంద‌ని తెలియ‌గానే స్నానం వ‌దిలేసి మ‌రీ మ‌ధ్య‌లో వెళ్ళిపోతాడు. ఈ స‌న్నివేశాన్ని తాజాగా విడుద‌లైన సాంగ్‌లో చూపించారు. ‘హుస్న్‌ పరచమ్‌..’ అంటూ సాగే ఈ ప్రత్యేక గీతంలో క‌త్రినా త‌న స్టెప్పుల‌తో ఆక‌ట్టుకుంది. ‘బబితా కుమారి వచ్చింది.. ఈ ఏడాది ఈ పాట హైలైట్‌గా నిలవబోతోంది’అంటూ షారూఖ్ ఈ పాట‌ని షేర్ చేశారు. ఈ సాంగ్ ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తుంది. డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానున్న ఈ చిత్రం ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. అనుష్క శ‌ర్మ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషించింది. స‌ల్మాన్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు అతిధి పాత్ర‌ల‌లో మెర‌వ‌నున్నారు. షారూఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో షారూఖ్ మ‌రుగుజ్జుగా క‌నిపించ‌నున్న విష‌యం విదిత‌మే.

2222
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles