కొత్త లుక్‌లో రానా.. షాక‌వుతున్న ఫ్యాన్స్

Thu,April 25, 2019 01:44 PM
Hunky Actor Rana Daggubati Once Again Breaks The Internet

బాహుబ‌లి చిత్రం త‌ర్వాత రానా క్రేజ్ ఏ రేంజ్‌కి పెరిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న రానా త్వ‌ర‌లో వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నున్నాడు. అయితే బాహుబ‌లి చిత్రంలో భారీ కాయంతో క‌నిపించిన రానా ఆ త‌ర్వాత వివిధ గెట‌ప్స్‌లో క‌నిపించాడు. ఒక‌సారి స‌న్న‌గా ,మ‌రోసారి గడ్డం లేకుండా క్లీన్ షేవ్‌లో, ఇంకో సారి భారీ గ‌డ్డంతో ప‌లు గెట‌ప్స్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. తాజాగా రానా హైద‌రాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కెమెరా కంట ప‌డ్డాడు. అందులో స‌న్న‌గా, భారీ గ‌డ్డంతో క‌నిపించాడు. రానా లుక్‌కి సంబంధించిన ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

అయితే రానా ఆరోగ్య స‌మ‌స్య‌ల వ‌ల‌న ఇలా మారాడా లేదంటే త‌ను ప్ర‌స్తుతం న‌టిస్తున్న‌ హాథీ మేరే సాథీ లేదా విరాటపర్వం సినిమా కోసం అలా మారాడా అన్న‌ది తెలియాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం రానా కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధ‌ప‌డుతున్నారంటూ పుకార్లు షికారు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై క్లారిటీ ఇచ్చాడు రానా . కేవ‌లం బ్ల‌డ్ ప్రెష‌ర్ (బీపీ)కి సంబంధించిన స‌మస్య‌తో బాధ‌ప‌డుతున్నాను. కొద్ది రోజుల‌లో అంతా సెట్ అవుతుంది. మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. కానీ పుకార్లు సృష్టించకండి ఇది నా ఆరోగ్యం మీది కాదు అని ట్వీట్ చేశాడు. మ‌రి తాజా లుక్‌పై రానా ఏమైన స్పందిస్తాడా అనేది చూడాలి.

4069
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles